“ఆర్టీసీ అంటే బీఆర్ఎస్ కు చులకన”
ఆర్టీసీ అంటే సీఎం కేసీఆర్ కు చులకన అని అన్నారు రాష్ట్ర బీజేపీ మహిళా నేత గోదావరి అంజిరెడ్డి. మీడియాతో మాట్లాడిన ఆవిడ… BHEL బస్ డిపోను తరలించడాన్ని నిరసిస్తూ… జాతీయ రహదారి నుంచి బిహెచ్ఈఎల్ డిపో వరకు ర్యాలీ చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యేకు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదని అన్నారు. సీఎం కేసీఆర్ కు ముందునుంచే రాష్ట్ర ఆర్టీసీపై చులకన భావం ఉందని చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆర్టీసీ కార్మికుల పొట్టగొట్టేలా వ్యవహరిస్తుందని గోదావరి అన్నారు. 32 ఏళ్లుగా ఉన్న బీహెచ్ఈఎల్ డిపోను ఇప్పటికిప్పుడే తరలించడం ఏంటని ఆవిడ మండి పడ్డారు.