కవితకు ముగిసిన విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితను విచారించారు సీబీఐ అధికారులు. ఆదివారం కవిత నివాసంలో విచారణ జరిగింది. దాదాపు 7 గంటలకు పైగా సాగిన విచారణను వీడియో తీశారు. మహిళా అధికారులతో కూడిన సీబీఐ బృందం కవితను ప్రశ్నించింది. పొద్దున కవిత అడ్వొకెట్ సమక్షంలో ప్రశ్నించిన అధికారులు… మధ్యాహ్నం కవితను విచారించేటప్పుడు అడ్వొకేట్ ను ప్రశ్నించే గదిలోకి అనుమతించలేదు.

ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 6.30 నిమిషాల వరకు విచారణ సాగింది. 160 సీఆర్పీసీ కింద కవిత స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు సీబీఐ అధికారులు. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ప్రస్తావించిన తర్వాత కవితకు నోటీసులు జారీ చేసింది సీబీఐ.

Spread the love