తుఫాను ఎఫెక్ట్ : రాష్ట్రంలో వర్షాలు
మండూస్ తుఫాన్ ఎఫెక్ట్ తో రాష్ట్రంలో వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో… ఈ నెల 14 వరకు ఓ మోస్తారు వర్షాలు కురవనున్నాయి. దక్షిణ తెలంగాణలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్ తో పాటు.. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షం నమోదైంది.
రానున్న 12 గంటల్లో వాతావరణం మరింత బలహీనపడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు లో వర్షాలు నమోదవుతాయని అధికారులు స్పష్టం చేశారు.