దుబాయ్ to భారత్… ఆగని అక్రమ రవాణా

దుబాయ్ నుంచి భారత్ కు అక్రమంగా బంగారాన్ని రవాణా చేయడం కామన్ అయిపోయింది. ఎన్ని సార్లు భారత విమానాశ్రయాలలో దుండగులు పట్టుబడినా బంగారాన్ని అక్రమంగా రవాణా చేయడం మాత్రం ఆగడం లేదు. తాజాగా.. దుబాయ్ నుంచి మహమ్మద్ గౌస్ అనే వ్యక్తి బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డాడు.

మంగళవారం దుబాయ్ నుంచి మహమ్మద్ గౌస్ భారత్ కు చేరుకున్నాడు. విమానాశ్రయంలో దిగిన తర్వాత అనుమానాస్పదంగా కనిపిస్తుండటంతో కస్టమ్స్ అధికారులు గౌస్ ను తనిఖీ చేశారు. దీంతో అతని షర్ట్ లో 804 గ్రాముల బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు.

తనిఖీలో భాగంగా… షర్ట్ విప్పేటప్పుడు బరువుగా ఉండటంతో అధికారులు షర్ట్ లో చెక్ చేశారు. దీంతో షర్ట్ లోపలు మరో బట్టతో సంచిలాగ కుట్టి అందులో బంగారాన్ని దాచాడు. దీంతో నిందితుడు గౌస్ ను అరెస్ట్ చేసి… బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు.

Spread the love