నా కొడుకు పేరు ఈ థియేటర్లోనే పెట్టాం : బాలకృష్ణ

తారాకరామా థియోటర్ లో తన కొడుకు మోక్షజ్ఞ పేరును పెట్టారని గుర్తుచేసుకున్నారు హీరో బాలకృష్ణ. కాచీగూడ లో ఉన్న తారకరామ థియేటర్ ను ఏసియన్ తారకరామ గా ప్రజలముందుకు వచ్చింది. అయితే ఈరోజు ఏసియన్ తారకరామ థియేటర్ ను హీరో నందమూరి బాలకృష్ణ రిబ్బన్ కట్ చేసి పున: ప్రారంభించారు.

మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ.. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ మా తల్లి బసవతారకం పేరు మీద పెట్టామని.. ఆ హాస్పిటల్ తమకు ఆలయంతో సమానమని అన్నారు. దీంతో పాటే సినిమా థియేటర్ కూడా మాకు దేవాలయంతో సమానమని ఆయన స్పష్టం చేశారు.

తన కొడుకు నామకరనం తారకరామ థియేటర్ లో జరిగిందని బాలకృష్ణ గుర్తు చేశారు. 1978లో తారకరామ థియేటర్.. సలీం అనార్కలీ సినిమాతో మొదలైందని అన్నారు. ప్రస్తుతం కొత్త టెక్నాలజీని ధియేటర్ కు అప్లై చేసి ప్రజల ముందుకు తీసుకొస్తున్నామని ఆయన తెలిపారు.

ఈ థియేటర్ లో డాన్ సినిమా 525 రోజులు ఆడిందని.. చెప్పారు. ఏషియన్‌ సినిమాస్‌ సంస్థతో తాము కలిసి ధియేటర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఆనందంగా ఉందని అన్నారు బాలకృష్ణ. కాగా డిసెంబర్ 16 నుంచి అవతార్‌2 స్క్రీనింగ్ జరుగనుంది.

మరిన్ని వార్తల కొసం…

అఘోరా గురువులతో స్పెషల్ ఇంటర్వూ…

Spread the love