రాజశ్యామల యాగంలో సీఎం కేసీఆర్

ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ భవన్ ను ప్రారంభించారు ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్. ముందుగా.. ఢిల్లీ లోని సర్దార్ పటేల్ మర్గ్ లోని బీఆర్ఎస్ కార్యాలయంలో జరుగుతున్న రాజ శ్యామల యాగానికి హజరయ్యారు కేసీఆర్ దంపతులు. వీరికి వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు.

యాగం పూర్తయ్యాక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆ తర్వాత పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి, ఎమ్మెల్సీ కవితతో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభంకాగానే… రాష్ట్ర మంత్రి కేటీఆర్.. బీఆర్ఎస్ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం …

Spread the love