రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని మెగా స్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో అధికారికంగా తెలిపారు. ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలతో ఉపాసనా రామ్ చరణ్ లు తల్లిదండ్రులు కాబోతున్నారని చెప్పారు. దీంతో మెగా కాంపౌండ్ మొత్తం సంతోషంతో నిండిపోయింది. ఇటు సినీ ప్రముఖులు, నాయకులు రామ్ చరణ్ ఉపాసనా దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అడ్వాని జతకట్టింది. రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. శంకర్ సినిమాలో చిరంజీవి నటించాలనుకున్నా ఆ కోరిక మాత్రం మెగా స్టార్ కు తీరలేదు. అయితే… మెగా తనయుడు రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో సినిమా వస్తుండటం మెగా అభిమానులకు సంతోషాన్ని ఇస్తుంది.

Spread the love