అనుచిత వ్యాఖ్యలు : మంత్రిపై సిరా దాడి

Category Title Separator Tagline Post Excerpt ప్రజల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఓ మంత్రి పై సిరా దాడి జరిగింది. వివరాల్లోకి వెలితే… మహారాష్ట్ర మంత్రి చంద్రకాంత్ పాటిల్ పై ఓ యువకుడు సిరాతో దాడి చేశాడు. అప్రమత్తమైన సిబ్బంది మంత్రిని అక్కడినుంచి తీసుకెళ్లారు. దీంతో పాటు దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.


అయితే రెండు రోజుల క్రితం.. మంత్రి చంద్రకాంత్ మాట్లాడుతూ… విద్యాలయాల అభివృద్ధి కోసం అంబేడ్కర్, పులే లు ప్రభుత్వ నిధులను కోరలేదని అన్నారు. ఇప్పుడు కూడా ప్రజలకు స్కూల్లు, కాలేజీలు కావాలంటే నిధులు అడుక్కుని విద్యాలయాలు కట్టుకోవాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు వివాదమయ్యాయి. దీంతో పాటు మహారాష్ట్ర డిప్యుటీ సీఎం స్పందించారు. అయితే… నిధులు సమకూర్చుకోవాలని మంత్రి ఉద్దేశమని తెలిపారు.
Spread the love