హిజబ్ వివాదంలో మరో కోణం… ప్రభుత్వ కాళేజీలకు వెళ్లరట..!

కర్ణాటకలో హిజబ్ వివాదం తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఉడిపి జిల్లాలోని ఓ ప్రభుత్వ కాలేజీకి హిబబ్ వేసుకురావొద్దన్నందుకు కోర్టు దాకా వెళ్లారు ముస్లిం విద్యార్థులు. తాజాగా ఓ మీడియా సంస్థ చేసిన సర్వేలో ఉడిపిలోని ప్రభుత్వ కాలేజీలలో ముస్లిం విద్యార్ధులు తక్కువగా జాయిన్ అవుతున్నట్లు తేలింది. 2021-22లో 5962 మంది విద్యార్థులు ప్రభుత్వ కాలేజీలలో జాయిన్ అవగా 2022-23 లో 4971మంది జాయిన్ అయినట్లు తెలుస్తుంది. దీంతో పాటు.. ఇంటర్ కాలేజీలో విద్యార్థుల జాయినింగ్ తో పోలిస్తే ప్రభుత్వ డిగ్రీ కాలేజీలలో ముస్లిం విద్యార్థుల జాయినింగ్ ఘననీయంగా తగ్గిందని సమాచారం.

2021-22లో 388 ( 178 మంది బాలికలు, 210 మంది బాలురు) విద్యార్థులు ప్రభుత్వ ఇంటర్ కలేజీలో జాయిన్ అవగా.. 2022-23కి గాను 186 మంది విద్యార్ధులు మాత్రమే ప్రభుత్వ కాలేజీలో జాయిన్ అయ్యారు. హిజబ్ సమస్య కారణంగా ఉడిపి జిల్లాలో ముస్లిం విద్యార్థులు ప్రభుత్వ కాలేజీలలో కంటే ప్రైవేట్ కాలేజీలలో జాయిన్ అవుతున్నట్లు తెలుస్తుంది. ఇండియన్ ఎక్స్ ప్రెస్ సలియత్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ నిర్వాహకుడు అస్లాం హైకాడి మాట్లాడుతూ తమ విద్యాసంస్థలలో గత సంవత్సరాలకంటే ముస్లిం బాలికల జాయినింగ్ ఈ సంవత్సరం గణనీయంగా పెరిగిందని తెలిపారు. హిజబ్ ఘటన వారిని వ్యక్తిగతంగా ఎలా ప్రభావితం చేసిందో చెప్పడానికి ఈ జాయినింగ్స్ నిదర్శనమని అస్లాం హైకాడి అన్నారు.

ఈ విషయంపై కర్ణాటక విద్యాశాఖ మంత్రి నగేష్ మీడియాతో మాట్లాడుతూ… గత సంవత్సరం కంటే ఈ ఏడాది పీయూసీలలో అడ్మిషన్లు పెరిగాయని అన్నారు. ప్రభుత్వ కాలేజీల అడ్మిషన్ విషయంలో తాము విద్యార్ధుల కులం, మతం తో సంబంధం లేకుండా నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అయితే ముస్లిం విద్యార్థుల అడ్మిషన్ లో ఏమైనా తగ్గుదల కనిపిస్తే తాము పరిశీలించడానికి రెడీగా ఉన్నట్లు తెలిపారు.

హిజబ్ సమస్యతో గత ఏడాది 12 మంది ముస్లిం బాలికలలో ఇద్దరు మాత్రమే కాలేజీ మానేసినట్లు తెలుస్తుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఆరుగురు విద్యార్థులు ఫాస్ కాలేదని నలుగురు చాలా రోజుల నుంచి కాలేజీకి రావడం లేదని సమాచారం.

హిజబ్ వివాదం ఎక్కడి నుండి ప్రారంభమైందంటే…
2021-22 విద్యాసంవత్సరంలో ఉడిపిలోని ఓ ప్రభుత్వ కళాశాల కామన్ డ్రెస్ కోడ్ ను అమలు చేసింది. దీంతో ముస్లిం విద్యార్థినిలు హిజబ్ ను ధరించి కాలేజీకి వస్తుండటంతో.. విద్యార్థులు తప్పనిసరిగా కాలేజీ సూచనలు పాటించాలని హిజబ్ ను ధరించవద్దని కోరింది. దీంతో ముస్లిం యువతులు హిజబ్ ధరించడం తమ హక్కని దర్నా చేశారు. దీంతో.. హిందూ విద్యార్థులు కూడా కాషాయ కండువాలు, శాలువాలు వేసుకుని కాలేజీకి వెళ్లారు. తమకు కూడా తమ హక్కును కాపాడుకునే బాధ్యత ఉందని అందుకు కాలేజీ అనుమతించాలని అన్నారు. దీంతో మత పరమైనవి ఏ విద్యార్థి కూడా కాలేజీలోకి తీసుకురాకూడదని కాలేజీ ప్రిన్సిపల్ తెలిపారు.

హిజబ్ ను, కాషాయ కండువాలను కాలేజీలోకి అనుమతించాలని విద్యార్థుల దర్నా తీవ్ర రూపం దాల్చడంతో కర్ణాటక ప్రభుత్వం కల్పించుకుంది. ఏ మత పరమైన అంశాలను కాలేజీలోకి తీసుకురాకూడదని కామన్ డ్రెస్సింగ్ ను విద్యార్థులు తప్పక పాటించాలని కర్ణాట గవర్నమెంట్ తెలిపింది. దీంతో ముస్లిం విద్యార్థులు కర్ణాటక హైకోర్టులో తమకు హిజబ్ వేసుకుని కాలేజీకి వెళ్లేందుకు అనుమతించాలంటూ పిటీషన్ దాఖలు చేశారు. కేసును విచారించిన దర్మాసనం కాలేజీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

హిజబ్ వివాదం వికిపీడియా లింక్

Spread the love