అవతార్ 2 రివ్యూ

#Avatar : The Way of Water

యోధుడు తనను తాను రక్షించుకునేందుకు పారిపోకూడదు… ఎదురించి పోరాడాలి అదే యోధుడి నీతి.

ప్రముఖ దర్శకుడు జేమ్స్ కెమెరాన్ తెరకెక్కించిన అవతార్ 2 ప్రజల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా అవతార్ సినిమా ప్రేక్షకులను కట్టిపడేసిందన్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్ గా అవతార్ 2 ను తెరకెక్కించారు కెమెరాన్. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 16 న రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందా. విజువల్ వండర్ గా తెరకెక్కిన అవతార్ 2… లో యుద్ధవీరుడి ఎమోషనల్ ఎలిమెంట్లే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఒక యోదుడు తనను, తన కుటుంబాన్ని రక్షించుకునేందుకు పారిపోకూడదని ఎదురించి నిలబడి పోరాడడమే వీరుడి లక్షణమని..అలాంటి వీరునికే విజయం లభిస్తుందన్న సూత్రం ఆదారాంగా సినిమా తెరకెక్కింది.

మొదటి భాగంలో మనుషులను తరిమేసిన తర్వాత.. పాండోరా గ్రహాంల అవతార్ సుఖంగా ఉంటారు. దాదాపు 18 ఏళ్లకు పైగా గడుస్తాయి. అప్పటికి హీరో జాక్ దంపతులకు నలుగురు పిల్లలు పుడతారు. అప్పుడు మళ్లీ మనుషులు అవతార్ ల రూపంలో బ్లూటీంగా తిరిగి పాండోరాను ఆక్రమించుకోడానికి వస్తారు. అప్పుడు హీరో తన జాతిని వదిలేసి దూరంగా ఉన్న సముద్ర అవతార్ ల దగ్గరికి వెళ్తాడు. అక్కడికి కూడా మనుషులు వస్తుండటంతో ఏం చేయాలో తోచక మనుషులతో పోరాడతాడు. అప్పుడు రియలైజ్ అయిన విషయమే… యోధుడు తనను తాను రక్షించుకునేందుకు పారిపోకూడదు… ఎదురించి పోరాడాలి.

అవతార్ 2 సినిమా కేవలం విజువల్ వండరే కాదు. ఎమోషన్, ఫ్యామిలీ ఎటాచ్మెంట్, భయం, ఎదురింపు, తెగింపు, చివరికి విజయం లాంటి ఎమోషన్లతో సినిమా రూపొందింది.

మరిన్ని వార్తలకోసం కింది లింక్ క్లిక్ చేయండి…

Spread the love