బండి సంజయ్ వ్యాఖ్యలు బాధించాయి : ఎమ్మెల్సీ కవిత

ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని తెలిపారు. మీడియాతో మాట్లాడిన కవిత… బీజేపీ నాయకులకు ఆడవాళ్లకు గౌరవం ఇవ్వడం తెలియదని అన్నారు. బెంగాళ్ లో మమతా బెనర్జీని ప్రధాని మోడీ అగౌరవ పరచినట్లుగా… ఇక్కడ బండి సంజయ్ తనను అగౌరవపరుస్తున్నారని అన్నారు.

బీఆర్ఎస్ ఏర్పాటుతో బీజేపీ నాయకులకు వణుకు పుట్టిందని అన్నారు కవిత. దేశంలో బీజేపీ వ్యతిరేక పార్టీలతో తాము కలసి పోరాడుతామని తెలిపారు. బీఆర్ఎస్ సీఎం కేసీఆర్ మానస పుత్రిక అని ఆవిడ స్పష్టం చేశారు. దీంతో పాటే తెలంగాణ జాగృతి కార్యక్రమాలు కూడా కొనసాగుతాయని అన్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Spread the love