జనవరి 10 నుంచి శ్రీలంకలో వన్టే సిరీస్… జట్టులోకి బుమ్రా

శ్రీలంకతో జరగబోయే మూడు వన్డేల సిరీస్ కు టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. కొత్త సంవత్సరం తొలి సిరీస్ ను శ్రీలంకతో ఆడనుంది భారత్. 2022లో టీమిండియాకు అంతగా విజయాలు లేకపోవడంతో ఈ ఏడాది అయినా సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. శ్రీలంకతో జరగబోయే ఈ సిరీస్ కు భారత ఫేసర్ బుమ్రా తిరిగి జట్టులో స్థానం సంపాదించుకున్నాడు.

టీమిండియా జట్టు ఈ విధంగా ఉంది. రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ , హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్.

శ్రీలంకతో జరుగనున్న వన్డే సిరీస్ కు ఫేసర్ జస్ప్రీత్ బుమ్రా స్థానం సంపాదించుకున్నాడు. వెన్నునొప్పి కారణంగా జట్టుకు దూరమైన బుమ్రా ఫిట్ నెస్ సంపాదించడంతో సెలెక్టర్లు అతనికి జట్టులో స్థానం కల్పించారు.

జనవరి 10 నుంచి శ్రీలంకతో భారత్ మూడు వన్డేలు ఆడనుంది. మొదటి వన్డే జనవరి 10న గౌహతిలో, రెండవ వన్డే 12న కోల్ కత్తాలో, మూడవ వన్టే 15న త్రివేండ్రంలో జరుగనుంది. అన్ని మ్యాచ్ లు మధ్యాహ్నం 1.30 నిమిషాలనుంచి ప్రారంభం కానున్నాయి.

https://twitter.com/BCCI

 

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Spread the love