క్యారెక్టర్ లేనోల్ల చేతిలో కాంగ్రెస్ పార్టీ : మధుయాష్కీ

క్యారెక్టర్ లేనోల్లే కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారని అన్నారు టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ #మధుయాష్కీ . నాలుగు పార్టీలు మారి వచ్చిన వ్యక్తి కాంగ్రెస్ ను ఉద్దరిస్తాడట అని రేవంత్ ను పరోక్షంగా విమర్శించారు. సీఎల్పీ నాయకున్ని విమర్శించే స్థాయి కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ఎక్కడిదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కొత్తగా వేసిన కమిటీలో తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. కమిటీలో 108 మంది గాను 58 మంది తెలుగుదేశం నుంచి వచ్చినవారే ఉన్నారని తెలిపారు.

విద్యార్థినులే అపర కాళీ.. హెడ్ మాస్టర్ కు దేహశుద్ధి

కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్లను సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారని అన్నారు రాజనరసింహ. తన వాళ్లే పదవుల్లో ఉండాలని తాము బావించలేదని కాంగ్రెస్ ను కాపాడుకోవడంలో భాగంగానే సమావేశమయ్యామని ఆయన తెలిపారు. తాము పుట్టింది, పెరిగింది చావబోయేది కాంగ్రెస్ లోనేనని తెలిపారు. అయితే… కాంగ్రెస్ పార్టీ సీనియర్లందరూ మూకుమ్మడిగా రేవంత్ రెడ్డిపై దాడి చేస్తున్నారు. వీరి దాడిపై రేవంత్ ఎలా స్పంధిస్తారో చూడాలిక.

మరిన్ని వార్తలకోసం కింది లింక్ క్లిక్ చేయండి…

Spread the love