పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభం : వంట గ్యాస్ ను ప్లాస్టిక్ కవర్లలో నింపుకుంటున్నరు

అభివృద్ధిపై కాకుండా తీవ్రవాదంపైనే దృష్టి పెట్టిన పాకిస్తాన్ కష్టాలు తారాస్థాయికి చేరాయి. పాకిస్తాన్ లో ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గొదుమపిండి, చెక్కెర, నెయ్యి ధరలను 60 శాతం పెంచిందని అక్కడి మీడియా తెలిపింది. అయితే తాజాగా వంట గ్యాస్ సంక్షోభం పాకిస్తాన్ లో ఏర్పడింది. వంట గ్యాస్ ను మామూలుగా గ్యాస్ సిలిండర్లలో నింపుకుని వాడుకుంటారు. కాగా పాకిస్తాన్ లో అయితే ప్లాస్టిక్ కవర్లలో నింపి గ్యాస్ ను వాడుకుంటున్నారు. ప్లాస్టిక్ కవర్లలో, బెలున్స్ లలో గ్యాస్ ను నింపి తీసుకెళ్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

గ్యాస్ సరఫరా లేకపోవడంతో పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తూన్ ప్రవినెన్స్ లో నివసిస్తున్న ప్రజలు వంట గ్యాస్ ను నిల్వచేసుకోవడానికి ప్లాస్టిక్ సంచులను ఉపయోగిస్తున్నారు. కరక్ జిల్లాలో 2007 నుంచి గ్యాస్ సరఫరా లేదని అక్కడి మీడియా స్పష్టం చేసింది. పాక్ లో ఆర్థిక సంక్షోభం కారణంగా ఉద్యోగుల వేతనాల్లో కోతలు, నిత్యవసర ధరల పెంపు కామన్ అయిపోయాయి. యుటిలిటీ స్టోర్స్ కార్పొరేషన్ (USC) ద్వారా విక్రయించే గోధుమ పిండి, చక్కెర, నెయ్యి ధరలను కూడా… పాకిస్తాన్ ప్రభుత్వం 60 శాతం కు పెంచిందని పాక్ మీడియా తెలిపింది.

పాకిస్తాన్ ఏర్పడినప్పటినుంచి అక్కడి నాయకత్వం విద్య, అభివృద్ధి లాంటి విషయాలపై దృష్టి సారించకుండా తీవ్రవాదాన్ని పెంచి పోషించాయని అందుకూ పాక్ అభివృద్ది చెందకుండా తారోగమనం పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్, పాక్ లు ఒకే సారి తమ ప్రస్థానాన్ని ప్రారంభించగా భారత్ చంద్రయాన్ తో పాటు ఐటీ, ఇన్ఫ్రా లాంటి మరెన్నో అభివృద్ధి పనులతో ముందుకు వెళ్తుంటే పాకిస్తాన్ మాత్రం ప్రపంచంలో తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నదేశంగా మిగిలిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

https://twitter.com/lonewolf_singh

Spread the love