Gupta Navarathrulu : రాజ శ్యామల మాత సాధనా ప్రపంచం
మనిషి తనను తాను ఉద్దరించుకునేందుకు ఒక సాధనం… సాధన
భగవత్ శక్తిని తెలుసుకొవాలన్నా, అనుభూతి చెందాలన్నా ఇదొక్కటే మార్గం…
భగవంతుడంటే నమ్మకం కాదు… భగవంతుడంటే తయారు చేసిన రూపం కాదు…
భగవంతుడు అంటే ఓ శక్తి…
ఆ భగవత్ శక్తిని మించిన మరొక శక్తి లేదు.. ఎందుకంటే ఉన్నదంతా ఆ భగవత్ శక్తే…
ఆ శక్తిని, భగవత్ రూపాన్ని చూడాలనుకుంటే అనుభూతి పొందాలనుకుంటే ( ఎటువంటి ఇమాజినేషన్ లేకుండా ) సాధనా మార్గంలో అడుగుపెట్టాల్సిందే…
అందుకు కొన్ని విశిష్ట రోజులు, శక్తివంతమైన రోజులు ఉంటాయి…
అందులో భాగంగా… గుప్తనవరాత్రులు వస్తున్నాయి…
ఆ నవరాత్రులే శ్యామలా నవరాత్రులు…
జనవరి 22 నుంచి ప్రారంభమై 9 రోజుల పాటు జరుగనున్నాయి…
ఈ నవరాత్రులలో అమ్మవారి స్తోత్ర సాధన, మంత్ర సాధన చేయవచ్చు…
గురువు ఉన్నవాళ్లు మంత్రోపదేశం పొంది చేయవచ్చు. లేనివారు గురువును వెతుక్కోవచ్చు…
గురువు లేని వారు… అమ్మవారి స్తోత్రసాధనను సొంతంగా ఇంట్లోనే చేయవచ్చు…
22 రాత్రి 9 తర్వాత అమ్మవారికి పంచోపచారపూజలు చేసి అమ్మవారి స్తోత్రాన్ని 3,5,9 ఇలా నచ్చినన్ని సార్లు చదువుకోవచ్చు.. ఇది బేసిక్ అన్నమాట…
ప్రతీ రోజు నైవేధ్యం సమర్పించాలి… సాధకుడు గ్రహించాలి.. 9 రోజులు..
ఇలా చిన్నగా సాధనా మార్గంలోకి వెళ్తూ ఉంటే… అదే దారి చూపుతుంది..
సాధనా మార్గంలో ముఖ్యంగా సాధకునికి అహంకారం. నేనే గొప్ప అనే ఆలోచన, చిల్లర మనస్సు, కుల, వర్ణ బేధాలు, ఉండకూడదు (ఇవి మనిషికి కావలసిన లక్షణాలు)…
ఇక గురువుని వెతుక్కోవాలనుకునే వారికి ఒక మనవి…
ఏంటంటే…
కాషాయం వేసుకున్న ప్రతీ వారు సద్గురువులు కారు,
రాజకీయ నాయకుల చుట్టూ తిరిగే వారు, తిప్పించుకునే వారు అసలు గురుపరంపరకు చెందిన వారు కాదు…
కాబట్టి గురువుకు కులం, వర్ణం లాంటివి ఉండదు… ఎవరైనా సరే ధర్మపరులు అని అనిపిస్తే, ఉచితంగా సాధనలు నేర్పిస్తుంటే, ఉచితంగా ఉపదేశాలు ఇస్తే…. వారి దగ్గర దీక్ష పొంది సాధన చేయవచ్చు…
ఎలాంటి గుణాలు ఉన్న గురువు దగ్గర ఉపదేశం పొందితే అలాంటి గుణాలే సాధకునికి లభిస్తాయి… కాబట్టి జాగ్రత్త.
స్వస్తి..
హర హర మహాదేవ్
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…