స్నేహితులతో కలిసి మందుతాగుతున్నడు… అంతలోనే అక్కడికి పులి వచ్చి..!

స్నేహితులతో సరదాగా మందుతాగాలనుకున్నడో వ్యక్తి. ఇంతలోనే పులి రూపంలో మృత్యువు అతన్ని పలకరించింది. ఉత్తరాఖండ్ రిషికేశ్ ఖతారి గ్రామానికి చెందిన నఫీస్ అనే వ్యక్తి, అతని ఊరి సమీపంలో ఉన్న చెరువు కట్టపై కూర్చుని అతని స్నేహితులతో కలిసి మందు తాగుతున్నాడు. ఇంతలోనే ఓ పులి అతనిపై దాడి చేసింది. మందుమత్తులో అతను పులినుంచి తప్పించుకోలేక పోయాడు. నఫీస్ ను పులి ఎత్తుకెళ్లింది. పులిని చూసి భయపడిన అతని స్నేహితులు పారిపోయారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా నఫీస్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఆదివారం ఉదయం నఫీస్ మృతదేహం లభించింది. పులి అతన్ని సగం తిని వదిలేసింది. కాగా.. ఇది కార్బెట్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అని తరచూ అక్కడికి పులులు వస్తుంటాయని పోలీసులు తెలిపారు. గ్రామస్థులు పులులు తిరిగే ప్రదేశానికి వెళ్లొద్దని పోలీసులు సూచించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కు పంపారు పోలీసులు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

బాలున్ని మింగిన నీటి గుర్రం

అవతార్ 2 రివ్యూ

Spread the love