హిందూపురం ప్రజలకు బాలయ్య చికెన్ బిర్యాణి

రెండు రూపాలకే చికెన్ బిర్యానీ పెడుతున్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. ఏపీలోని హిందూపురంలో అన్నా క్యాంటిన్ ను ఏర్పాటు చేసి రెండు రూపాయలకే బోజనాన్ని అందిస్తున్నారు. అన్నా క్యాంటీన్ ప్రారంభించి మంగళవారానికి 200 రోజులు పూర్తయిన సందర్భంగా.. బాలకృష్ణ స్వయంగా పేదలకు అన్నాన్ని వడ్డించారు.

బిర్యానీతో పాటు.. కోడిగుడ్డు, స్వీటును కూడా అందించారు బాలకృష్ణ. అయితే అన్నా క్యాంటిన్ ను కొనసాగకుండా జగన్ ప్రభుత్వం కుట్రపన్నుతుందని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఇప్పటికే రెండు సార్ల అన్నా క్యాంటిన్ స్థలాన్ని మార్పులు చేసిందని చెప్పారు. పేదవారికి అన్నాన్ని అందిస్తుంటే ఏపీ ప్రభుత్వానికి ఎందుకు నొప్పి వస్తుందని విమర్శించారు. మరోసారి స్థలమార్పిడికి పాల్పడితే తీవ్రపరినామానాలు ఎదురవుతాయని అన్నారు.

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి…

Spread the love