Kantara Bhoota Kola : భూతకోలాకు హాజరైన హీరోయిన్ అనుష్క శెట్టి
తెలుగు హీరోయిన్ అనుష్క భూతకోళ కళారూపాన్ని తిలకించింది. ఆమె స్వస్థలమైన కర్ణాటక మంగళూరుకు వెళ్లిన ఆవిడ సనాతన ధర్మంలో కళారూపమైన భూత కోల ప్రదర్శనను వీక్షించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. అనుష్కను చూడగానే ఆమె అభిమానులు థ్రిల్ అయ్యారు. ప్రస్తుతం ఆవిడ స్లిమ్ అయింది. అందమైన పట్టుచీర ధరించి అందంగా కనిపించింది. చాలా కాలంగా అనుష్క ఇటు సోషల్ మీడియాలోను, అటు సినిమాలలోనూ కనిపించలేదు.
అనుష్క తదుపరి చిత్రం…
అనుష్క చివరి సినిమా నాలుగేళ్ల క్రితం విడుదలైంది. డిసెంబర్ 15 2022న అనుష్క ఒక చెఫ్ ఫొటోను రిలీజ్ చేయడంతో, ఆమె తదుపరి చిత్రం చెఫ్ బేస్డ్ గా నటిస్తున్నట్లు సినీ అభిమానులు అభిప్రాయపడ్డారు. అయితే ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నట్లు సమాచారం. ఎప్రిల్ 4 2023నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో అనుష్కతో పాటు నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. స్వీటీ అభిమానులు ఆమె సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
కాంతారా టీంకు అభినందనలు తెలిపిన అనుష్క…
కాంతారా సినిమాను చూసిన అనుష్క మూవీ టీంకు అభినందనలు తెలిపింది. కాంతారా టీం అందరూ అద్భుతంగా నటించారని ప్రశంసలు కురిపించింది. ఎట్టకేలకు అనుష్క బయట కనిపించడంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Another glimpse of Sweety attending Boothakola Festival in her home town ❤️❤️✨✨#AnushkaShetty #Sweety #Anushka48 pic.twitter.com/XvwIXTnjha
— PRANUSHKA FANCLUB 🌸❤️ (@pranushka_fan) December 18, 2022
https://www.instagram.com/anushkashettyofficial/