కారును ఢీకొట్టి డ్రైవర్ ను ఈడ్చుకెళ్లాడు – వీడియో

ఓ వృద్దున్ని బైకుతో ఈఢ్చుకెళ్లాడు ఓ వ్యక్తి. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది. అయితే ఏరోజు జరిగింది అనే విషయంపై స్పష్టతలేదు. స్కూటీ రైడర్ 55 సంవత్సరాల వ్యక్తిని స్కూటీతో గుంజుకుని వెళ్తున్నాడు. ఈసదరు వ్యక్తి స్కూటీని వెనకాలనుంచి పట్టుకుని ఉన్నాడు. వివరాల్లోకి వెళితే… ముత్తప్ప (55) అనే వ్యక్తి కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సాహిల్ అనే బైక్ రైడర్, కారును ఢీకొట్టి పారిపోతుండగా బైక్ ను అలాగే పట్టుకున్నాడు ముత్తప్ప. దీంతో సాహిల్ అతన్ని రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లాడు. దీంతో అటువైపున వెళ్తున్న ప్రయాణికుడు బైకర్ సాహిల్ ను మెడికల్ సేల్స్ మెన్ గా గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం పోలీసుల అదుపులో సాహిల్ ఉన్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Spread the love