COVID 19 : మాస్క్ తప్పనిసరి చేసిన కేరళ ప్రభుత్వం
మాస్క్ తప్పని సరిగా ధరించాలని తెలిపింది కేరళ ప్రభుత్వం. ఇందుకుగాను ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కోవిడ్ పుంజుకునే సూచనలు కనిపిస్తున్నట్లు అభిప్రాయపడింది. బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, సమావేశాలలో ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఆదేశించింది. ప్రైవేటు స్థలాలలో ప్రజలకోసం శానిటైజర్లను ఏర్పాటు చేయాలని థిటయేటర్, మాల్స్, నిత్యవసర దుఖానాల యజమానులకు ఆదేశాలు జారీచేసింది. రాబోయే 30 రోజుల వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది.
సోమవారం భారత దేశం 114 కొత్త కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లను కనుగొంది. అయితే కరోనా రికవరీ రేటు 98.80 శాతం ఉన్నట్లు అధికారులు తెలిపారు. యాక్టీవ్ కేసులు 2,119కి తగ్గినట్లు అధికారులు తెలిపారు.
ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం డేటా ప్రకారం, USలో కేసుల సంఖ్య పెరుగుదలకు కారణమైన XBB.1.5 వేరియంట్ కేసుల సంఖ్య భారతదేశంలో 26కి పెరిగింది. XBB.1.5 వేరియంట్ కేసులు ఇప్పటివరకు ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ తో సహా 11రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కనుగొనబడ్డాయి.
One thought on “COVID 19 : మాస్క్ తప్పనిసరి చేసిన కేరళ ప్రభుత్వం”
Comments are closed.