వేటకు వెళ్లిన రాజు మృత్యుంజయుడు..!

వేటకు వెళ్లి బండరాళ్ల మధ్య తలకిందులుగా ఇరుక్కున్న యువకుడిని పోలీసులు రక్షించారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డికి చెందిన షాడ రాజు మంగళవారం సాయంత్రం అతని మిత్రుడు మహేష్ తో కలిసి ఘన్ పూర్ శివారు అడవిలోకి వేటకు వెళ్లాడు. రాళ్లగుట్టపై నడుచుకుంటూ వెళ్లగా అతడి మోబైల్ బండరాళ్ల మధ్య పడిపోయింది. మోబైల్ తీసే క్రమంలో రాజు మండరాళ్ల మధ్య ఇరుక్కుపోయాడు. మహేష్ ఎంత ప్రయత్నించినా రాజును బయటకు తీసుకురాలేకపోయాడు.

పోలీసులకు చెప్పేందుకు బయపడి…
వేటకు వెళ్లి రాళ్ల మధ్య ఇరుక్కుపోయిన కారణంగా… పోలీసులకు సమాచారం ఇవ్వాలంటే బయపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం వరకు రాజును బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన కుటుంబసభ్యులు చేసేదేమిలేక పోలీసులకు సమాచారం ఇచ్చారు.

రంగంలోకి దిగిన పోలీసులు రెండు జేసీబీల సహాయంతో కొండరాళ్లను బద్దలుకొట్టారు. జిల్లా అదనపు ఎస్పీ అన్యోన్య, ఇన్ చార్జ్ తహసీల్దార్ సాయిలు సహాయక చర్యలను పర్యవేక్షించారు. బుధవారం సాయంత్రం నుంచి చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ గురువారం మధ్యాహ్నానికి పూర్తయింది. పోలీసులు, ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. బండ రాళ్ల మధ్య ఇరుక్కున్న అతడికి ధైర్యం చెబుతు నీళ్లు,ఓఆర్ఎస్ తాగించేందుకు ప్రయత్నించారు. ఎట్టకేలకు రాజును రెస్క్యూ చేసి బయటకు తీసుకురావడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.మరిన్ని వార్తల కోసం… ఇక్కడ క్లిక్ చేయండి…

Spread the love