వెంకి మామ పార్టీ ఏది : చిరంజీవి

వెంకి మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మెగా స్టార్ చిరంజీవి. ఇందులో భాగంగా పార్టీ ఏదంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ఇందులో విక్టరీ వెంకటేష్ తో చిరంజీవి దిగిన ఫోటోను ట్వీట్ చేశారు. అగ్ర హీరోలు ఇలా సరదాగా నడుచుకుంటుండటంతో… తెలుగు సినీ అభిమానులతో పాటు… అటు మెగా అభిమానులు, వెంకి మామ అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు.

అయితే ఈ మద్యే చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడన్న సంతోషకరమైన వార్తను తెలిపారు. బాల హనుమాన్ ఫొటోతో కూడిన ఇమేజ్ ను ట్వీట్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. చరణ్, ఉపాసన దంపతులు పెళ్లిచేసుకున్న 10 సంవత్సరాల తర్వాత బిడ్డకు జన్మనిస్తుండటంతో మెగా అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.

Spread the love