సిరిసిల్లలో యువతి కిడ్నాప్… మంత్రి కేటీఆర్ సీరియస్ – వీడియో

సినిమా తరహారలో యువతిని కిడ్నాప్ చేసారు దుండగులు. ఈ ఘటన మంత్రి కేటీఆర్ నియోజకర్గమైన సిరిసిల్లలో జరిగింది. ఈ ఘటనపై కేటీఆర్ సీరియస్ అయ్యారు. ఎస్పీ రాహుల్ హెగ్డే‭ను పిలిపించుకుని యువతి కిడ్నాప్ పై వివరాలను అడిగి తెలుసుకున్నారు. సాయంత్రంలోగా నిందితులను పట్టుకోవాలని యువతిని కాపాడాలని ఆదేశాలు జారీచేశారు.

మూడపల్లిలో మంగళవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో యువతి కిడ్నాప్ అయింది. ఆ సమయంలో తండ్రి చంద్రయ్యతో కలిసి ఆంజనేయస్వామి వారి దేవాలయంలో పూజ చేసి బయటకు వస్తుండగా యువతిని దుండగులు కిడ్నాప్ చేశారు. గుడి బయట కారు ఆపి యువతి బయటకు రాగానే ఆమె తండ్రిని కొట్టి, యువతిని బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. ఈ కిడ్నాప్ ఘటనపై అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్ర చారి విచారణను కొనసాగిస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

బాలున్ని మింగిన నీటి గుర్రం

అవతార్ 2 రివ్యూ

Spread the love