టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదం… యువతకు ఓ పాఠం

టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ కు ప్లాస్టిక్ సర్జరీ జరిగింది. శుక్రవారం పొద్దున పంత్ కు కారు ప్రమాదం జరుగగా ప్కస్తుతం ఆయనకు డెహ్రాడూన్ లో చికిత్స జరుగుతుంది. ఇప్పటికే పంత్ ఆరోగ్యపరిస్థితిపై ప్రధాని మోడీ ఆరా తీశారు. అయితే…ప్రమాదం జరిగినప్పుడు పంత్ పంత్ నిద్రపోయి కారు నడిపాడని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. యాక్సిడెంట్ నుంచి ఎలాగో బయట పడ్డ పంత్ కెరీర్ విషయంలో మాత్రం స్వయంకృతాపరాదంతో జీవితాన్ని నాశనం చేసుకున్నాడని క్రీడా విశ్లేషకులు బావిస్తున్నారు.


పంత్ ముందు నుంచే దూకుడు స్వబావంగల యువకుడు. చిన్న వయసులో టీమిండియా స్థాయిలో, ఐపీఎల్ స్థాయిలో ఆడిన అవకాశం రావడం కూడా పంత్ కు ఓవర్ కాపన్పిడెంట్ వచ్చిందని తెలుస్తుంది. అయితే పంత్ హైస్పీడ్ తో కారునడపడం అలవాటు.

గతంలోనే టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ , పంత్ లు మాట్లాడుకుంటుండగా… నాకు ఏమైనా సలహా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు అని పంత్ అడిగాడు. అప్పుడు శిఖర్ ధావన్.. కారు అధిక స్పీడ్ తో నడపవద్దని సలహా చెప్తున్నాను అని చెప్తాడు. అయినా పంత్ మాత్రం మారలేదు. అతని దూకుడు కూడా తగ్గించుకోలేదు. పంత్ కేవలం తన వ్యక్తిగత హాబీల విషయంలోనే కాక… క్రికెట్ లో కూడా అవసరం లేని దూకుడును ప్రదర్శించి అవకాశాలను జారవిడచాడు.

పంత్ కారు ప్రమాదాన్ని కనుక గమనిస్తే… శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్కు వెళ్తుండగా..రూర్కి వద్ద పంత్ కారు ప్రమాదానికి గురైంది. పంత్ ను రక్షించిన బస్సు డ్రైవర్ మీడియాతో మాట్లాడుతూ… తాను ఢిల్లీకి వెళ్తుండగా అతను నడిపించే బస్సుకు ఎదురుగా ఓ కారు అధిక వేగంతో దూసుకుపోయిందని.. డివైడర్ కు ఢీకొట్టిందని తెలిపారు. బస్సు ఆపి కారు దగ్గరికి వెళ్లి చూడగా… కారు డివైడర్ ను గుద్దుకుని అప్పుడప్పుడే మంటలు అంటుకుంటుందని తెలపాడు.

అందులోనుంచి ఒక యువకుడు కారునుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడని కారు డోరు ఎంతకూ తెరుచుకోవడం లేదని చెప్పాడు. అప్పుడు డ్రైవర్ వెళ్లి కారు డోరును తెరువగా.. తన పేరు పంత్ అని తాను టీమిండియా క్రికెటర్ నని తన ఫోన్ తీసుకుని తన తల్లికి కాల్ చేయాలని కోరాడు. అయితే తనకు క్రికెట్ చూడటం అలవాటు లేకపోవడం వలన పంత్ ను గర్తుపట్టలేదని చెప్పాడు.

పంత్ గురించి పోలీసులకు, అతని తల్లికి ఫోన్ చేయడం హాస్పిటల్ లో జాయిన్ చేయడం జరిగిపోయాయి. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ డీజీపీ మాట్లాడుతూ పంత్ అధిక వేగంతో కారు నడిపాడని ఆపై కారులో నిద్రపోతూ నడిపాడని చెప్పారు. తనపై,  తన కెరీర్ పై సోయి లేకుండా ఒక అంతర్జాతీయ క్రికెటర్ ఇలా వ్యవహరిస్తుండటం భారత దేశానికి మొదటిసారి కావచ్చు.

సచిన్, ద్రావిడ్, గంగూళీ, వీవీఎస్ లక్ష్మణ్ లాంటి మోచ్యురిటీ ఉన్న క్రికెటర్లను చూసిన భారత్ ఇప్పుడు కనీస అవగాహన వ్యక్తిగత జీవితం, కెరీర్ పై పట్టింపులేకుండా ఉన్న క్రికెటర్లను ఈకాలంలో చూస్తున్నామని పలువురు క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం పంత్ కు ప్రమాదం ఏమీ లేకపోయినా… కుడి కాలు లిగ్మెంట్‌ జరిగినట్లు రిపోర్ట్ వచ్చింది. టీమిండియాకు ఆడాలన్నా, అంతర్జాతీయంగా రాణించాలన్నా ఫిట్ నెస్ తప్పనిసరి. కాగా ప్రస్తుతం పంత్ కెరీర్ ప్రమాదంలో ఉందని మాత్రం క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

కాబట్టి ఈ కాలం యువత జీవితంలో రాణించాలంటే దూకుడు స్వబావానికి కళ్లెం వేయడం తప్పనిసరని తెలుసుకోవాలి. లేకుంటే కెరీరే కాదు వాళ్ల కుటుంబాలుకూడా కష్టపడాల్సివస్తుంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Spread the love