RRR సినిమాకు అంతర్జాతీయ అవార్డులు

తెలుగు సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు పలు అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. రాజమౌళీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఇప్పటికూ దేశంలోని పలు అవార్డులు లభించగా… అంతర్జాతీయంగా కూడా ఇప్పుడు సత్తా చాటుతుంది ఆర్ఆర్ఆర్. తాజాగా ‘ది ఫిలడెల్ఫియా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్’ అవార్డ్స్ లో సత్తాచాటింది. ఫిలా ఎఫ్ సీసీ అవార్డ్స్ లో ఆర్ఆర్ఆర్ సినిమా 3 విభాగాల్లో విజేతగా నిలిచింది. ఉత్తమ సినిమాటోగ్రాఫర్, ఉత్తమ విదేశీ చిత్రం, ఉత్తమ సౌండ్ ట్రాక్ విభాగాల్లోనూ ఈ అవార్డులను కైవసం చేసుకుంది. దీంతో ఇటు రామ్ చరన్ అభిమానులు, అటు తారక్ అభిమానులతో పాటు తెలుగు ఇండస్టీకూడ గర్వంగా భావిస్తుంది.


https://twitter.com/RRRMovie/status/1602314174524456962/photo/1

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

బాలున్ని మింగిన నీటి గుర్రం

అవతార్ 2 రివ్యూ

Spread the love