విద్యార్థినులే అపర కాళీ.. హెడ్ మాస్టర్ కు దేహశుద్ధి

విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన హెడ్ మాస్టర్ కు దేహశుద్ధిచేశారు స్టుడెంట్స్. కర్నాటకలోని శ్రీరంగపట్నంలోని కట్టేరిగ్రామంలో చిన్మయ ఆనందమూర్తి అనే హెడ్ మాస్టర్ గత కొంతకాలంగా మైనర్ విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. బాధితురాలు తన బాధను తొటి విద్యార్థులతో చెప్పుకోగా… విద్యార్థినులు అందరూ కలిసి హెడ్ మాస్టర్ ను చితకబాదారు.

హెడ్ మాస్టర్ మామూలుగా కళాశాలలో సాయంత్రి 6 వరకే విధుల్లో ఉండాలి. కానీ రాత్రి 12 అయినా హాస్టల్ నుంచి వెళ్లకపోవడంతో పలువురు విమర్శించారు. తాను విద్యార్థినుల ఆహారం విషయంతో శ్రద్ద వహిస్తున్నందునే రాత్రి వరకు ఉంటున్నానని తెలిపాడు హెడ్ మాస్టర్.

విద్యార్థినుల భద్రత విషయమే తాను రాత్రి 12గంటల వరకు ఉంటున్నానని చెప్పిన హెడ్ మాస్టర్ పలువురు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. గత 3 ఏళ్లుగా ఇలాగే ప్రవర్తిస్తుండటంతో తాజాగా విద్యార్థినులు ఎదురుతిరిగి హెడ్ మాస్టర్ కు దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు ఇవ్వగా… నిందితుడిపై ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Spread the love