బాలున్ని మింగిన నీటి గుర్రం

కొన్ని వింతలు అప్పుడప్పుడు చోటుచేసుకుంటాయి. అందులో భాగంగానే ఓ రెండేళ్ల బాలున్ని నీటిగుర్రం ( హిప్పోపొటమస్) మింగింది. ఈ ఘటన ఉగాండాలో జరిగింది. ఉగాండాలో సరస్సుకు సమీపంలో ఓ కుటుంబం నివసిస్తుంది. ఇంటిముందు రెండేళ్ల బాలుడు ఆడుకుంటుండగా.. తల్లిదండ్రులు ఇంట్లో పనిచేసుకుంటున్నారు.

అవతార్ 2 రివ్యూ

అనుకోకుండా సరస్సులోనుంచి ఓ హిప్పోపొటమస్ బయటకు వచ్చి రెండేళ్ల బాలున్ని అమాంతంగా మింగేసింది. అటువైపుగా వెళ్తున్న ఓ వ్యక్తి బాలున్ని నీటిగుర్రం మింగడం చూసి గట్టిగా అరిచాడు. దీంతో హిప్పోపొటమస్ ఆ బాలున్ని వదిలేసి సరస్సులోకి వెళ్లిపోయింది. కంగారుపడ్డ తల్లిదండ్రులు బాలున్ని హాస్పిటల్ తీసుకెళ్లగా.. ప్రాణాపాయం ఏమీ లేదని తెలిపారు.

శాఖాహారి అయిన హిప్పోపొటమస్ బాలున్ని మింగడానికి ఎలా ప్రయత్నంచింతో అర్థం కావడంలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే శాకాహార జంతువులైనా, మరేవైనా దాడిచేయాలనుకున్నప్పుడు ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.

మరిన్ని వార్తలకోసం కింది లింక్ క్లిక్ చేయండి… …..

Spread the love