‘కూ’ ఎకౌంట్ ను తొలగించిన ట్విట్టర్

భారత మైక్రో బ్లాగింగ్ ‘కూ’ కు చెందిన ట్విట్టర్ ఎకౌంట్ ను ఎలన్ మస్క్ తొలగించారు. దీంతో పాటు వాషింగ్టన్ పోస్ట్ , న్యూయార్క్ టైమ్స్, సీఎన్ ఎన్ లాంటి మీడియా సంస్థల్లో పని చేస్తున్న జర్నలిస్ట్ ల ఎకౌంట్లను కూడా ట్విట్టర్ నుంచి తొలగించారు మస్క్. జర్నలిస్టులు వాళ్ల వార్తలకు చెందిన లింకులను ట్విట్టర్ వేధిక ద్వారా పంచుకోవడం సురక్షితం కాదని తెలిపారు.

ఎలన్ మస్క్ తీరు ప్రజాస్వామ్య బద్దంగా లేదని కూ వ్యవస్థాపకులు మయాంక్ అభిప్రాయపడ్డారు. ఎలన్ మస్క్ ఈజ్ డిస్ట్రాయింగ్ ట్విట్టర్ అని ట్వీట్ చేశారు. అయితే ట్విట్టర్ కు పోటీగా.. భారత్ వేధికగా.. ‘కూ’ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Spread the love