కోవిడ్ అలర్ట్ : 24 గంటల్లో ఇద్దరు మృతి
దేశంలో మరోసారి కోవిడ్ కోరలు చాచడానికి సిద్ధమవుతుంది. ఇందుకుగాను ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తప్పనిసరిగా మాస్క్ లను ధరించాలని, శానిటైజర్ ను వాడాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 173 కోవిడ్ కేసులు నమోదవగా.. ఇద్దరు మృతిచెందారు. దీంతో కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలను జారీచేసింది.
ప్రస్తుతం దేశంలో 2670 యాక్టీవ్ కేసులు ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. అయితే యాక్టీవ్ కేసులలో ఇన్ఫెక్షన్ కేవలం 0.01గా ఉంది రికవరీ రేటు 98.80గా ఉంది. ప్రస్తుతం కర్ణాటకలో 326, కేరళలో 1,444, మహారాష్ట్రలో 161, ఒడిశాలో 88, రాజస్థాన్లో 79, తమిళనాడులో 86, ఉత్తరప్రదేశ్లో 49, పశ్చిమ బెంగాల్లో 55 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.