జమ్మూలో ఎన్ కౌంటర్ ఇద్దరు తీవ్రవాదులు హతం

మంగళవారం పొద్దున జమ్ముకశ్మీర్ లోని బుద్గామ్ జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బుద్గాం పట్టనంలోని జిల్లా కోర్టు దగ్గర ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, ఆర్మీ బుద్గామ్ లోని ప్రాంతాన్ని చుట్టు ముట్టాయి. ఉగ్రవాదులను పట్టుకునేందుకు జవాన్లు ప్రయత్నిస్తున్నారు.

జమ్మూ కశ్మీర్ లో చాలా కాలంగా స్తబ్దుగా పడి ఉన్న ఉగ్రవాదులు ఈ రోజు కాల్పులకు తెగబడటంపై కారణం ఉందంటున్నారు విశ్లేషకులు. పాకిస్తాన్ లో ఉంటూ జమ్మూ కశ్మీర్ లో తీవ్రవాద కలాపాలను నిర్వహించే లష్కరే తొయిబా కీలయ నాయకుడైన అబ్దుల్ రెహ్మాన్ మక్కీని ఈ రోజు ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి అంతజ్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. గత ఏడాది భారత్, అమెరికాలు సంయుక్తంగా మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని కోరింది. ఇందుకు చైనా అడ్డుపడింది. ఆరు నెలల పాటు భారత్ పంపిన తీర్మానాన్ని హోల్డ్ లో పెట్టిన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (UNSC). జనవరి 16న మక్కీని అంర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. దీంతో కశ్మీర్ లో ఉన్న ఉగ్రవాదులు తమ అసహనాన్ని వ్వక్తం చేసేందుకు కాల్పులకు తెగబడుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే లష్కర్ టెర్రరిస్ట్ గ్రూపుకు అబ్దుల్ రెహ్మాన్ మక్కీ కీలకంగా వ్యవహరిస్తున్నాడు. యువకులను తీవ్రవాదం వైపు మరల్చడం, లష్కరేకు నగదును సమకూర్చడంతో పాటు కశ్మీర్ లో జరిగే దాడులకు కూడా మక్కీ హస్తం ఉంది.

 

Spread the love