భారత్ తో యుద్దం చేసి దరిద్రాన్ని తెచ్చుకున్నాం : పాక్ ప్రధాని

పాకిస్తాన్ కు ఎప్పటికీ బుద్ధిరాదనే విషయం మరొకసారి స్పష్టం అవుతుంది. తాజాగా పాక్ ప్రధాని షేహబాజ్ షరీఫ్ దుబాయ్ కు చెందిన ఓ మీడియా చానల్ తో మాట్లాడారు. తాము భారత్ తో మూడు యుద్ధాలు చేశామని అవి తమ దేశానికి ప్రజలకు దరిద్రాన్ని, నిరుద్యోగాన్ని మాత్రమే తీసుకువచ్చాయని చెప్పారు. ప్రస్తుతం తాము భారత్ తో స్నేహపూరిత వాతావరణాన్ని కోరుకుంటున్నామని అన్నారు. అయితే అంతకు ముందు కశ్మీర్ అంశంపై ఇరు దేశాలు కూర్చుని మాట్లాడుకోవాలని ఆయన కోరారు. ప్రధాని నరేంధ్రమోడీకి తాను చెప్పదలచుకున్నది ఒక్కటేనని… కూర్చుండి మాట్లాడుకుని కశ్మీర్ సమస్యను పరిష్కరించుకుందామని షరీఫ్ పిలుపునిచ్చాడు.

బాంబులను తయారు చేయడానికి పాకిస్తాన్ తన వనరులను ఇకపై ఖర్చుచేయదని షరీఫ్ తెలిపారు. అయితే యుద్దం అనేది పైవాడి చేతిలో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఐక్య రాజ్య సమితిలో కశ్మీర్ అంశాన్ని పాక్ ప్రస్తావించినపుడు భారత్ పాక్ అధికారులపై విరుచుకు పడిందని చెప్పారు. భారత్, పాకిస్తాన్ లో నిపుణులైన డాక్టర్లు, ఇంజనీర్లు ఉన్నారని వారిని ఇరుదేశాల అభివృద్ధికి వాడుకోవాలని అన్నారు షరీఫ్.

COVID 19 : మాస్క్ తప్పనిసరి చేసిన కేరళ ప్రభుత్వం

పాకిస్తాన్ లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొంది. పాకిస్తాన్ ప్రభుత్వం సరఫరా చేసే పిండి కోసం అక్కడి ప్రజలు ఒకరితో ఒకరు గొడవ పడుతున్నారు. పిండి లారీని బైకులతో ఛేజ్ చేసి మరి పిండిని దొంగిలిస్తున్నారు.

పాకిస్తాన్ ప్రధాని ఇచ్చిన పిలుపుపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. పాకిస్తాన్ ఇప్పుడు దారిద్రంలో మునిగి తేలుతుందని అలాంటిది భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశంతో పోల్చుకుంటుందని అంటున్నారు. పైగా స్నేహ హస్తం చాస్తూనే కశ్మీర్ అంశంపై మాట్లాడుతుందని అంటున్నారు. పాకిస్తాన్ తన సొంత ప్రజలకే ఆహారాన్ని అందించేందుకు కష్టపడుతుందని… భారత్ మత్రం పలు దేశాలకు ఉచితంగా కొవిడ్ కిట్ లను, అఫ్గనిస్తాన్ లాంటి దేశాలకు ఉచితంగా గొదుమలను సరఫరా చేసే స్థితిలో ఉందని అంటున్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

 

Spread the love